దస్తురాబాద్ మండల కేంద్రంలో గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్ గోపాల్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దస్తురాబాద్

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో వీబిజి రాంజీ పథకంపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై చర్చించి, వాటికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించారు.