తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రానున్న పన్నెండు గంటల్ లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి, ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారుతుందని వెల్లడించారు. నవంబర్ రెండవ తేదీ నాటికి ఏపీ తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్ లో భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు.