రూ.2 వేల లోపు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు
రిపోర్టర్: సురేష్
స్థలం: India
డిజిటల్ పేమెంట్స్ చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.2 వేల లోపు యూపీఐ లావాదేవీలు మరియు రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులు, చెల్లింపు సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వ్యక్తిగత ఖాతాల మధ్య నగదు బదిలీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది.