టెలికాం వినియోగదారులకు కేవలం వాయిస్ కాల్స్ ప్లాన్లు తెచ్చేలా ట్రాయ్ ఆదేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు కేవలం వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్రత్యేక టారిఫ్ వోచర్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. డేటా అవసరం లేని సాధారణ కస్టమర్ల కోసం తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని ట్రాయ్ ఆదేశించింది. తద్వారా మొబైల్ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు లభించనుంది.