ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు విడతల కరువు భత్యం (DA) ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1 నుండి పెరిగిన డీఏ అమలుకానుండగా, మొత్తం డీఏ 41.86 శాతానికి చేరింది. బకాయిలను విడతలవారీగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.