అక్కులపేట పాఠశాలలో ఘనంగా జరిగిన హిందీ దివస్ వేడుకలు

రిపోర్టర్: RAMESH LAVETI స్థలం: ఆమదాలవలస

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కులపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందీ మంచ్ అధ్యక్షులు కనుగుల సత్యం మాస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక సిబ్బందితో పాటు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.