నిజామాబాద్ జిల్లా భీంగల్ లో అడ్డగోలుగా ఇసుక రవాణా
రిపోర్టర్: రాము
స్థలం: Nizamabad
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ శివారులోని కప్పుల వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మన ఇసుక వాహనం యాప్ లో నెలల తరబడి వేచి చూస్తున్నా అనుమతులు రాకపోగా, అధికార పార్టీ నేతల రికమండేషన్లు, ముడుపులతో కొత్త కమర్షియల్ మాల్స్ కు ఇబ్బడి ముబ్బడిగా ఇసుక కేటాయిస్తున్నారని స్థానికులు, బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని వెంటనే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.