సేవకు నిదర్శనంగా వికలాంగులకు అండగా నిలిచిన భాజపా నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎమ్మిగనూరు
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ అసెంబ్లీ కార్యాలయంలో వికలాంగులకు 20 సైకిల్ రిక్షాలను పంపిణీ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన వారికి అండగా నిలవడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ నెల రోజులపాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు.