మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అమరావతి ప్రాజెక్ట్ అమలు యూనిట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విరాజ్ సురాజ్ వాలా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మరియు వినుకొండ రహదారుల అభివృద్ధి పనులపై ఇద్దరు కీలక చర్చలు జరిపారు.