బాబుపట్టి గ్రామస్తులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు: త్వరలోనే గ్రంథాలయం తెరుస్తామని స్పష్టీకరణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్లోని తమ పూర్వీకుల గ్రామమైన బాబుపట్టిలో పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనుల్లో ఆలస్యం కావడంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. కౌన్ బనేగా కరోడ్పతి 18 షోలో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే అన్ని వసతులు కల్పించి గ్రంథాలయాన్ని ప్రారంభిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ జన్మస్థలమైన ఈ ప్రాంతంపై తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన గుర్తుచేశారు.