తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. సోమవారం అంకురార్పణతో ఉత్సవాలు మొదలుకానుండగా, 19న రాత్రి గరుడసేవ నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది.