ఉద్యోగులకు వంద శాతం ఉచిత నగదు రహిత వైద్యం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతను మెరుగుపరిచేందుకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెట్వర్క్ ఆసుపత్రులలో ఉద్యోగులు ఎలాంటి నగదు చెల్లించకుండా పూర్తిస్థాయి ఉచిత నగదు రహిత వైద్య సేవలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెడికల్ రీయింబర్స్మెంట్ విధానంలో ఎదురవుతున్న జాప్యానికి చెక్ పెట్టేలా జీవో నంబర్ 131ని విడుదల చేసి, ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఖాతాకు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.