రాజాపేట: పిట్టలగూడెంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పోలీసులను ఆశ్రయించిన మహిళలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం నెమిల మదిర పిట్టలగూడెంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తుండడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నామని పేర్కొన్నారు. ఈ అసాఘిక కార్యకలాపాలను అరికట్టి బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని కోరుతూ గ్రామ మహిళలు సోమవారం పోలీసులను, పంచాయతీ కార్యదర్శిని ఆశ్రయించి వినతిపత్రం అందజేశారు.