నాసిక్ కుంభమేళా షెడ్యూల్ విడుదల: అక్టోబర్ 31న ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: నాసిక్
మహారాష్ట్రలోని నాసిక్ మరియు త్రయంబకేశ్వర్ లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న సింహస్థ కుంభమేళా 2026 అక్టోబర్ 31వ తేదీన జెండా ఆవిష్కరణతో అధికారికంగా ప్రారంభం కానున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ పవిత్ర కుంభమేళాలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా మూడు ప్రధాన అమృతస్నానాల తేదీలతో పాటు పూర్తి షెడ్యూల్ ను అధికారులు స్పష్టం చేశారు.