కీర్తి ప్రతిష్టల వెనుక ఒంటరితనం అనుభవిస్తున్నానన్న ఐషోస్పీడ్ ఆవేదన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Global

ప్రముఖ అంతర్జాతీయ స్ట్రీమర్ ఐషోస్పీడ్ తన కీర్తి ప్రతిష్టల వెనుక తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సెప్టెంబర్ 25న ఆయన చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్షలాది మంది అభిమానులు తన పేరును అరుస్తున్నప్పటికీ, హోటల్ గదికి వెళ్లిన తర్వాత నిశ్శబ్ద వాతావరణంలో తాను ఒంటరిగా మిగిలిపోతున్నానని ఆయన వాపోయారు. అసలైన డారెన్ ఎవరో చాలా తక్కువ మందికే తెలుసని, కుటుంబ సభ్యులు, సాధారణ వ్యాపకాలు తనను తానుగా నిలబెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.