నియోజకవర్గాల అభివృద్ధికి కోటి నిధులు: సీఎంకు ఎమ్మెల్యే బేబీనాయన ప్రత్యేక ధన్యవాదాలు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

ప్రతి నియోజకవర్గానికి అత్యవసర అభివృద్ధి పనుల కోసం కోటి రూపాయల నిధులు విడుదల చేయడానికి అంగీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు (బేబీనాయన) కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ నెల పదమూడో తేదీన నిధులను విడుదల చేయనుందని వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. సీఎం నిర్ణయంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.