భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన వరంగల్ సీపీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: హన్మకొండ

శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ నెల పదకొండో తేదీ నుండి ప్రారంభం కానున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను వరంగల్ సీపీ ఎన్ శ్వేతా పరిశీలించారు. నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ స్పష్టం చేశారు.