పిఠాపురం అభివృద్ధి కోసం పన్నెండు కోట్ల నిధులు మంజూరు చేసిన జనసేన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Pithapuram
పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల నుంచి అందిన వినతులపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే పన్నెండు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని జనసేన పార్టీ వెల్లడించింది. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగుతోందని పార్టీ తెలిపింది.