ప్రమోద్ గౌడ్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన రేణికుంట్ల ప్రవీణ్
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
భీమిని మండలం వడాల గ్రామానికి చెందిన ప్రమోద్ గౌడ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదివారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహానికి ఘనంగా నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని రేణికుంట్ల ప్రవీణ్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.