పెదకోడపల్లిలో గంజాయికి బదులుగా రాజ్మా సాగు.. రైతులకు విత్తనాల పంపిణీ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పెదబయలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెద్దకొడపల్లిలో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా రాజ్మా పంట సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక రైతు సేవా కేంద్రంలో రైతులకు 90 శాతం సబ్సిడీపై రాజ్మా విత్తనాలను అందజేశారు. గంజాయి సాగును పూర్తిగా నిరుత్సాహపరిచి, రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బందితో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విత్తనాలను సద్వినియోగం చేసుకున్నారు.