ఘోరం: భర్తను చంపి పాము కాటుగా చిత్రీకరించిన భార్య, ప్రియుడికి మరణశిక్ష

రిపోర్టర్: శివ స్థలం: మీరట్

భర్తను హత్య చేసి పాము కాటుగా చిత్రీకరించిన భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్దీప్లకు కోర్టు మరణశిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో అమిత్ కశ్యప్ హత్యకు గురయ్యారు. గతేడాది ఏప్రిల్ పదమూడో తేదీన మంచంపై శవమై కనిపించిన అమిత్ మృతిపై కుటుంబ సభ్యులు లో అనుమానించగా, పోస్టుమార్టంలో ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.