ఢిల్లీ వీధుల్లో రాజకీయం కలకలం: నేతలంతా అక్కడే ఉండాలని రేవంత్ హెచ్చరిక
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
తదుపరి సూచనలు వచ్చే వరకు ఎవరూ ఢిల్లీని విడిచి వెళ్లవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఇండియా కూటమి ఆందోళనల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హస్తినలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.