అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాసాంధ్రులు

రిపోర్టర్: రాము స్థలం: ఫ్రెస్నో

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నోలో శ్రీకృష్ణ బృందావన మందిరం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అమర్చి ఆటపాటలతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.