నిరుద్యోగులకు షాక్: బిహార్ పీఎస్సీ 72వ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పాట్నా
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన 72వ కంబైండ్ కాంపిటేటివ్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల ఇరవై ఐదవ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను అపరిహార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. అయితే కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటివరకు తాజా షెడ్యూల్ వెల్లడించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.