మల్కాజిగిరిలో ఘనంగా వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేసిన అధికారులు

రిపోర్టర్: శివ స్థలం: మేడ్చల్

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 25న జరగనున్న వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు జోన్లలో 39 నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేయగా, భద్రత కోసం 84 స్టాటిక్, మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచారు. పారిశుద్ధ్యం కోసం 1,356 మంది సిబ్బందిని మోహరించడంతో పాటు వైద్య శిబిరాలు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు.