అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రైతులకు దసరా పండుగ కానుకగా అక్టోబర్ 17వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకంతో పాటు ఈ ఆర్థిక సహాయం అందనుంది. అయితే ఈ నిధులు పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.