నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయాలి: సింగరేణి సీఎండీ ఆదేశం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తెలంగాణ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఒడిశాలోని నైనీ గని నుంచి ప్రతిరోజూ ఇరవై వేల టన్నుల బొగ్గును రవాణా చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి స్పష్టం చేశారు. సింగరేణి భవ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను ముమ్మరం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు మరియు జనరల్ మేనేజర్లు పాల్గొన్నారని ఆయన తెలిపారు.