రాయిచేడ్‌లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఉప్పునుంతల

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచేడ్‌లో అచ్చంపేట నియోజకవర్గ స్థాయి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ నాణ్యతా ప్రమాణాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పనుల్లో ఎలాంటి రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.