స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహానికి ప్రాధాన్యం ఇవ్వాలని జీ కిషన్ రెడ్డి పిలుపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

స్థానిక ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తి ఎంతగానో దోహదపడుతోందని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని సంప్రదాయ వస్తువులు, చిరుధాన్యాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు. స్థానిక కళాకారులను, తయారీదారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు. దివ్యాంగుల సంక్షేమం, పెన్షన్ల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.