భారత్ లో తొలి పర్యటన: రోనాల్డో అభిమానులపై అర్జెంటీనా పారిశ్రామికవేత్త ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: సురేష్ స్థలం: Mumbai

భారత్ లో తొలిసారి పర్యటించిన అర్జెంటీనా పారిశ్రామికవేత్త ఫ్రెడెరికో ఆస్ట్ ముంబై నగరంలో తాను చూసిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక్కడి ట్రాఫిక్ గందరగోళం, ప్రజల ఆప్యాయతతో పాటు మెట్రో స్టేషన్ల శుభ్రతను ఆయన ప్రశంసించారు. అయితే భారతీయులు లియోనెల్ మెస్సీ కంటే క్రిస్టయానో రోనాల్డోను ఎక్కువగా ఇష్టపడుతున్నారని తాను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టు ద్వారా వెల్లడైంది.