షాద్‌నగర్‌లో పాఠశాల మెట్లపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి
రిపోర్టర్: విజయ్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదేళ్ల విద్యార్థిని వర్నిక మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పాఠశాల సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. బాలికకు ముందే గుండె సంబంధిత సమస్య ఉందని, శుక్రవారం రాత్రి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని షాద్‌నగర్ సీఐ కే సీతారాం తెలిపారు.