వైకాపా ఎంపీ గురుమూర్తికి సుప్రీంకోర్టులో చుక్కెదురు: ఎస్ఎల్పీ కొట్టివేత
రిపోర్టర్: హరి
స్థలం: దిల్లీ
విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ కేసులో రాష్ట్ర డీజీపీ మరియు ఇతర పోలీస్ అధికారుల పాత్రపై విచారణ జరపాలంటూ వైకాపా ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అక్కడే వాదనలు వినిపించాలని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లు ఉన్నత ధర్మాసనం అధికారికంగా వెల్లడించింది.