వైసీపీకి భారీ షాక్: టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి షేక్ కరీమూన్
రిపోర్టర్: విజయ్
స్థలం: పల్నాడు
చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన షేక్ కరీమూన్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారని స్థానిక నాయకులు తెలిపారు. ఈ పరిణామంతో మున్సిపల్ ఎన్నికల రేసులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని, కరీమూన్ చేరికతో పార్టీ మరింత బలపడుతుందని తెలుగుదేశం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.