జామియా యూనివర్సిటీలో ఉద్రిక్తత: విద్యార్థుల డిమాండ్లపై హైలెవెల్ కమిటీ ఏర్పాటు
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
విద్యార్థుల సంఘం పునరుద్ధరణ డిమాండ్‌తో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జామియా మిల్లియా ఇస్లామియా వర్సిటీ ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజార్ ఆసిఫ్ వెల్లడించారు. నిరసనకారులతో చర్చలు జరిపి శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు.