చౌటుప్పల్లో శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి డయగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ పురపాలిక కేంద్రంలోని చిన్నకొండూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి డయగ్నోస్టిక్ సెంటర్ను పురపాలక చైర్మన్ మొగుదాల పావని రమేష్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం వ్యవస్థాపకులు చైర్మన్ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ గోశిక వినయ్, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానికులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య పరీక్షలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.