బెల్లంపల్లిలో అభివృద్ధి పనులను పరిశీలించి సమీక్షించిన జిల్లా కలెక్టర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు పరిశీలించినట్లు కలెక్టర్ మంచిర్యాల తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్‌తో కలిసి నియోజకవర్గ పరిధిలోని మండలాల తహసిల్దార్లతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని పరిశీలిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.