జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పిలుపు
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి కోరారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీపడే క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలాన్లు, సివిల్ వివాదాలను దీని ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సమయం, ధనం ఆదా కావడంతో పాటు ఇరువర్గాల మధ్య సామరస్యం పెరుగుతుందని, వివరాల కోసం స్థానిక పోలీస్ స్టేషన్ లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని ఆయన సూచించారు.