ఉద్యోగులకు వరం ఈహెచ్ఎస్: మంచిర్యాలలో ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఈహెచ్ఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కోరారు. మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ అమలు తీరును పరిశీలించిన ఆయన ఇప్పటివరకు ఎనిమిది మంది రోగులు అడ్మిట్ అయ్యారని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో నగదు రహితంగా నాణ్యమైన వైద్యం అందుతోందని శ్రీహరి వీడియోలో స్పష్టం చేశారు.