భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగిన విశ్వకర్మ యజ్ఞ వేడుకలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ కాళీమాత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో విశ్వకర్మ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా శ్రీ భగవాన్ విశ్వకర్మ యజ్ఞం చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జాతీయ ఓబీసీ మోర్చా మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, 14వ వార్డు కౌన్సిలర్, 5వ వార్డు కౌన్సిలర్ రామన్న, సండూరు శేఖర్ తో పాటు దేవాలయ కమిటీ అధ్యక్షులు నాగోజు రామాంజనేయులు, మాజీ అధ్యక్షులు తల్లోజు విజయకృష్ణ, గౌరవ అధ్యక్షులు తల్లోజు వెంకటయ్య చారి, ప్రధాన కార్యదర్శి గన్నోజు శ్రీనివాస చారి, కోశాధికారి సీలోజ బ్రహ్మచారి మరియు ఉపాధ్యక్షులు గన్నోజు మల్లేశం, రాజశేఖర్ రాజు, ముతోజు యాదగిరి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.