నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎస్ఎస్బీ హెడ్ కాన్స్టేబుల్ రాత పరీక్ష మార్కులు విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

సశస్త్ర సీమా బల్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెడ్ కాన్స్టేబుల్ మినిస్ట్రియల్ రాత పరీక్ష మార్కులను అధికారికంగా విడుదల చేసినట్లు ఎస్ఎస్బీ అధికారులు వెల్లడించారు. జూలై ఏడవ తేదీన నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన అభ్యర్థులు అక్టోబర్ ఇరవై నాల్గవ తేదీలోపు ఆన్లైన్ పోర్టల్ ద్వారా మార్కుల పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.