తుపాకీతో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిన ఢిల్లీ కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

బ్రిక్స్ సదస్సు భద్రతా విధుల్లో ఉన్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు అతడిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో పాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమయ్యారు.