విజయవాడ పర్యటన: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విజయవాడలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిని సందర్శించి కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ఆలయానికి చేరుకుని అరగంట పాటు పూజల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.