భారీ వర్షంలోనూ ఓట్ల వేటలో దూకుడు పెంచిన సత్యవతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని దారకొండ పంచాయతీలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఆ ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా కూటమి ఎంపీటీసీ అభ్యర్థి పుట్టపల్లి సత్యవతి స్థానిక కూటమి నాయకులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలుస్తూ తమ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.