టెక్ మార్కెట్ లో కలకలం: త్వరలో రానున్న కొత్త వివో స్మార్ట్ ఫోన్
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త వివో ఎక్స్ 500 ఎఫ్ ఈ ఫోన్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. సింగపూర్ కు చెందిన ఐఎండీఏ సర్టిఫికేషన్ డేటాబేస్ లో ఈ కొత్త పరికరం త్వరలో విడుదల కానున్నట్లు స్పష్టమైందని టెక్ నిపుణులు తెలిపారు. ఈ సరికొత్త మొబైల్ ఫైవ్ జీ కనెక్టివిటీ తో పాటు అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుందని, త్వరలోనే మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం వెలువడింది.