విజయనగరం జిల్లాలో దారుణం: అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను భుజాన వేసుకుని ఏడు కిలోమీటర్లు నడిచిన తల్లి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Vizianagaram
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పన్నెండేళ్ల కుమార్తె సంపూర్ణను బతికించుకునేందుకు తల్లి సుకరమ్మ భుజాన వేసుకుని ఏడు కిలోమీటర్లు నడిచినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పల్లపు దుంగాడ గిరిజన గ్రామానికి వాహనాలు వచ్చే అవకాశం లేకపోవడంతో, కొండ దిగువన ఉన్న దిబ్బగుంట వరకు కుమార్తెను మోసుకెళ్లి ఆటోలో ఎస్.కోట ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి మళ్లీ వెనక్ కి మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లినట్లు బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.