జిల్లా పరిషత్ పీఠం కైవసమే లక్ష్యంగా తెదేపా మాస్టర్ ప్లాన్

రిపోర్టర్: రమేష్ స్థలం: సంగం

చాలా కాలం తర్వాత జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా వ్యూహాలు రచిస్తోందని నాయకులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో గతంలో కాంగ్రెస్, వైకాపా ఆధిపత్యం సాధించగా, ప్రస్తుతం పునర్విభజన అనంతరం 35 జడ్పీ స్థానాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఐదు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల కూడా గెలుపునకు అవసరమైన రాజకీయ సమీకరణాలు సిద్ధం చేస్తున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు.