కేసముద్రం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ శబరీష్

రిపోర్టర్: మహేష్ స్థలం: మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ను ఎస్పీ డా. శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఎస్పీ మహబూబాబాద్ (SP Mahabubabad) తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది విధులు, కేసుల దర్యాప్తు పురోగతితో పాటు పెండింగ్ కేసుల వివరాలను ఆయన పరిశీలించారు. గ్రామాల సందర్శనలు, వీపీవో విధులు, బీట్ నిర్వహణ మరియు రాత్రి గస్తీని మరింత పటిష్టంగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.