సినిమా సెన్సార్ పై సీబీఎఫ్సీ కొరడా: ఐదు కీలక నిబంధనలతో కఠిన మార్గదర్శకాలు

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

సినిమా సర్టిఫికేషన్ కోసం పూర్తి స్థాయి చిత్రాన్ని మాత్రమే సమర్పించాలని సీబీఎఫ్సీ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. అసంపూర్తిగా తెస్తే దరఖాస్తులను తిరస్కరిస్తామని, విడుదల తేదీలను అడ్డుపెట్టీ ఒత్తిడి తెస్తే కుదరదని బోర్డు తేల్చిచెప్పింది. శశి శేఖర్ వెంపటి అధ్యక్షతన ఏర్పాటైన కొత్త బోర్డు ఈ నిబంధనలను జారీ చేసింది. సమయానికి సెన్సార్ పూర్తి కావాలంటే ముందే ప్లా చేసుకోవాలని చలనచిత్ర పరిశ్రమకు సూచించారు.