దర్శకుడిగా ఎస్.కృష్ణ పరిచయం: నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు హై సినిమా
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి వద్ద కో-రైటర్‌గా పనిచేసిన ఎస్.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ 'హై' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో అనన్యశర్మ, ఎస్.కృష్ణ, పల్లవి దొర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని, ఈ చిత్రాన్ని నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు వెల్లడించారు. జీవితంలో మానసిక, నైతిక సంఘర్షణలకు అద్దం పట్టే కథతో ఈ సినిమాను రూపొందించామని, క్లిష్ట సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే జీవితంలోని అసలైన ఆనందమని ఆయన స్పష్టం చేశారు.