'కారుణ్య నియామకాల ద్వారా 389 ఉద్యోగాలు': కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 389 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 25 మందికి కారుణ్య నియామకపు ఉత్తర్వులను అందజేశారు. అర్హులైన కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియామకాలను పారదర్శకంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.